Monday, January 20, 2025

ఈసారి మానుకోటపై సైకిల్ జెండా ఎగరాలి : కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  పార్టీలో అన్ని స్థాయిల నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి ఈసారి మానుకోటలో సైకిల్ జెండాను ఎగురవేయాలని తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ సూచించారు. శనివారం ఎన్టీఆర్ భవన్‌లో మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వివిధ అనుబంధ సంఘాల నాయకులు జ్ఞానేశ్వర్‌ను కలిశారు.

ఈ సందర్భంగా మహబూబాబాద్ పార్లమెంట్ పూర్తిస్థాయి పార్టీ కమిటీని వేసినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మంచి పట్టు ఉందన్నారు. నాయకులు పార్టీ కేడర్‌ను ప్రజలకు అనుసంధానం చేసుకొని వారి మద్ధతు పొందడానికి కృషి చేయాలన్నారు.

టిడిపి హయాంలోనే గిరిజన ప్రాంత ప్రజలకు అన్ని విధాలా న్యాయం జరిగిందన్నారు. అందుకే ఆ ప్రాంత ప్రజలంతా తెలుగుదేశం వైపు చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ద్వారా మంచి జరుగుతుందని పార్టీలోకి వచ్చే వారిని స్వాగతించి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కాసాని సూచించారు. కాసానిని కలిసిన వారిలో ప్రేమ్‌చంద్ వ్యాస్, కె. ఐలయ్య, బొమ్మ వెంకటేశ్వర్లు, ఏషబోయిన ఎల్లయ్య యాదవ్, భీమా నాయక్, రాంరెడ్డి, రవి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News