Monday, December 23, 2024

టిడిపి భువనగిరి పార్లమెంట్ కమిటీ ప్రధానకార్యదర్శిగా పాండు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మోత్కూరు: టిడిపి భువనగిరి పార్లమెంట్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా మోత్కూరు మండలం పనకబండ గ్రామ మాజీ సర్పంచ్ సూదగాని పాండు నియమితులయ్యారు. పాండు ప్రస్తుతం టిడిపి మోత్కూరు మండల అధ్యక్షునిగా పని చేస్తున్నారు. పాండు తొలి నుంచి పార్టీని నమ్ముకుని పని చేస్తుండటంతో ఆయన్ను గుర్తించిన ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ భువనగిరి పార్లమెంట్ ప్రధానకార్యదర్శిగా నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా పాండు విలేకరులతో మాట్లాడుతూ తన నియామకం కోసం కృషి చేసిన భువనగిరి పార్లమెంట్ కమిటీ అధ్యక్షుడు కుందారపు కృష్ణమాచారి, తుంగతుర్తి నియోజకవర్గ ఇన్‌చార్జి ఆకారపు రమేష్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో పార్టీ ఇచ్చిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తానని, పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానన్నారు.

Also Read: తెలంగాణ ఉద్యమంలో వందల మంది ప్రాణత్యాగం: జూపల్లి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News