Monday, December 23, 2024

టిడిపిలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం: కేశినేని శ్వేత

- Advertisement -
- Advertisement -

అమరావతి: గత సంవత్సరం నుంచి ఎంపి కేశినేని నాని టిడిపిలో అవమానాలు ఎదుర్కొంటున్నారని విజయవాడ టిడిపి కార్పొరేటర్ కేశినేని శ్వేత తెలిపారు. కృష్ణా జిల్లాలో జరుగుతున్న విషయాలు టిడిపి అధిష్టానానికి తెలియదు అనే భ్రమలో ఉన్నామన్నారు. విజయవాడ పదకొండవ డివిజన్ కార్పొరేటర్‌గా తాను రాజీనామా చేశామనని శ్వేత పేర్కొన్నారు. తన రాజీనామా ఆమోదం పొందాక టిడిపికి రాజీనామా చేస్తానన్నారు. ఇప్పటికి టిడిపిని వీడాలనుకోవడంలేదని, టిడిపి మమ్మల్ని వద్దు అనుకుంటుందని, దీంతో తాము పార్టీలో కొనసాగడం భావ్యం కాదన్నారు. పార్టీకి రాజీనామా చేసిన తరువాత కేశినేని తన అభిమానులతో మాట్లాడి కార్యచరణ ప్రకటిస్తారని వివరించారు. గౌరవం లేని చోట పని చేయడం కష్టమని, ప్రజల తరపున పోరాటం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటామని శ్వేత చెప్పారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో ముగ్గురు నాయకులు మమ్మల్ని ఇబ్బందులకు గురి చేశారని, తాము బయటకు వెళ్తున్నామని, తమతో వచ్చేవారికి అండగా ఉంటామని ఆమె స్పష్టం చేశారు. తురువూరు సభకి కేశినేని నానికి సంబంధం ఏంటని టిడిపి నేత లోకేష్ అడిగారని, ఆయన పార్లమెంట ఆయనకు సంబంధం లేదనడం మంచిది కాదని హితువు పలికారు. కేశినేని నాని మూడో సారి కూడా విజయవాడ నుంచి పోటీ చేస్తారని ఆమె స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News