- Advertisement -
ఎపిలో టిడిపి కార్యకర్తలు, జన సైనికుల మధ్య మరోసారి ఘర్షణ చోటుచేసుకుంది. పుట్టిన రోజు వేడుకులకు పిలిచి.. జనసైనికులపై టిడిపి కార్యకర్తలు దాడి చేశారు. దీంతో ఇరువర్గాలు పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ఈ ఘటన కాకినాడ జిల్లా శంఖవరం మండలం మండపం గ్రామంలో చోటుచేసుకుంది. టీడీపీ నాయకుడి కొడుకు బర్త్ డే వేడుకలకు వెళ్లిన జనసేన నాయకులను ఎవరు పిలిచారంటూ టిడిపి కార్యకర్తలు అవమానించడంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. మాటా మాట పెరిగడంతో ఘర్షణకు దిగారు.
ఈ క్రమంలో ఇరువర్గాల నాయకులు కొట్టుకున్నారు. ఫంక్షన్ కు పిలిచి మరీ కొడతారా అంటూ జనసైనికులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడో ఒక చోట కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి.
- Advertisement -