- Advertisement -
తిరుపతి: శ్రీకాళహస్తి టిడిపి ఇన్‌ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీకాళహస్తి టూటౌన్‌లో సుధీర్ రెడ్డితో పాటు మరో 26 మందిపై కేసు నమోదు చేశారు. బొజ్జల సుధీర్ రెడ్డిపై ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. శ్రీకాళహస్తి రూరల్ సిఐ అజయ్ కుమార్‌కు ఫోన్ చేసి అసభ్య పదజాలంతో బొజ్జల సుధీర్ రెడ్డి తిట్టాడు. పోలీస్ స్టేషన్ ఎదుట సుధీర్ రెడ్డిని అతడి అనుచరులతో బైఠాయించారు. సిఐ అజయ్ కుమార్ చంపేస్తామని బెదిరించాడంటూ ఫిర్యాదు చేశాడు.
- Advertisement -