సాగునీటి ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వ అజమాయిషీ గెజిట్ ను ఉపసంహరించుకోవాలి: జాతీయపోలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్ర సాగునీటి ప్రాజెక్టులపై కేంద్రప్రభుత్వ అజమాయిషీ కోసం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషను కేంద్రప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని జాతీయపోలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రావుల మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వాలు తమ ప్రజల సౌలభ్యం కోసం సొంత నిధులతో నిర్మించుకున్న ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వ అజమాయిషీ ఏమిటని ప్రశ్నించారు. కేంద్రం తగవులు ఉంటే పెద్దన్న పాత్ర పోషించాలి గాని పూర్తి హక్కులు తీసుకోవడం ఏమిటని రావుల నిలదీశారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి,రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని మండిపడ్డారు. తెలంగాణా ప్రభుత్వం ఈ గెజిట్ ను కేంద్రం ఉపసంహరించే విధంగా ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. లేకపోతే దశల వారీగా తెలుగుదేశం పార్టీ ఉద్యమిస్తోందని హెచ్చరించారు.
తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు నందిమల్ల. అశోక్, వనపర్తి మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఏర్పులవెంకటయ్య యాదవ్, రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి సయ్యద్ జమీల్, రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి ఏర్పుల రవి యాదవ్, రాష్ట్ర మైనార్టీ నాయకులు హారుణ్ రషీద్, వనపర్తి పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఫజల్, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆవులశ్రీను, ఏర్పుల చిన్నయ్య యాదవ్, సింగల్ విండో డైరెక్టర్ నాగన్న యాదవ్,ఎం.బాలు నాయుడు, టి.యన్.టి.యు.సి వనపర్తి పట్టణ అధ్యక్షులు కొత్తగొల్లశంకర్, సయ్యద్ ముద్దసర్, తదితర తెలుగుదేశం పార్టీ నాయకులుపాల్గొన్నారు.