- Advertisement -
అమరావతి: కన్నతల్లి పట్ల సిఎం జగన్ మోహన్ రెడ్డి కర్కశంగా వ్యవహరిస్తున్నారని టిడిపి నేత పంచుమర్తి అనురాధ తెలిపారు. కన్న తల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడానికి సాయంత్రం ఆరు గంటల వరకు పట్టిందా? అని ప్రశ్నించారు. వివేకా హత్య కేసు నిందితులను కాపాడేందుకు సమయం ఉంది గానీ, తల్లికి శుభాకాంక్షలు చెప్పే తీరిక జగన్‌కు లేదా? అని అనురాధ దుమ్మెత్తిపోశారు. వైసిపి పార్టీ గౌరవాధ్యక్ష పదవి నుంచి తొలగించి ఇంటి నుంచి గెంటేశారని మండిపడ్డారు. తల్లి, చెల్లిని వాడుకుని వదిలేసిన జగన్‌కు ప్రజలు ఓ లెక్కా? అని అడిగారు.
Also Read: ఎక్కడ జగన్ ఉంటే.. అక్కడ శనే: చంద్రబాబు నాయుడు
- Advertisement -