Monday, December 23, 2024

వివాహితతో అసభ్యంగా ప్రవర్తించిన టిడిపి నాయకుడు… ఇంటిపై 20 మంది గుండాలతో దాడి

- Advertisement -
- Advertisement -

అమరావతి: విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. వివాహితను వేధిస్తున్నాడని ప్రశ్నించటంతో బాధిత కుటుంబ సభ్యులపై టిడిపి నేతలు దాడి చేశారు. ఈ దాడిలో నలుగరు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. టిడిపి నేత నరేష్ వివాహిత పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు వేధింపులకు గురి చేశాడు. నరేష్ వేధింపుల గురించి భర్త, అత్తమామలకు నందిని చెప్పడంతో ఆమె కుటుంబ సభ్యులు నరేష్ ఇంటికి వెళ్లి ప్రశ్నించారు. నరేష్ తన అనుచరులు 20 మందితో కలిసి నందిని ఇంటికి వెళ్లి కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో వివాహిత మరిది, అత్తతో పాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. 20 మంది వచ్చి బ్లేడు, కత్తులతో దాడి చేశారని బాధితురాలు నందిని తెలిపింది. తన భర్త, అత్త, మరిది తీవ్రంగా గాయపడ్డారని పేర్కొంది. టిడిపి అండతో నరేష్, రమణ రెచ్చిపోతున్నారని మండిపడింది. పలువురు టిడిపి నేతలతో నిందితులకు సత్సంబంధాలు ఉన్నాయని వివరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News