Saturday, January 11, 2025

బిఆర్‌ఎస్‌లో చేరిన టిడిపి అత్యంత విశ్వాసపాత్రుడు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: మహబూబ్‌నగర్‌ టిడిపి నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ సమక్షంలో శుక్రవారం బీఆర్‌ఎస్‌లో చేరారు. టిడిపికి అత్యంత విశ్వాసపాత్రుడైన నాయకుల్లో ఒకరైన రావుల చంద్రశేఖర్ టిడిపి వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు హయాం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు.

పార్టీ ఇటీవలి నిర్ణయాలపై అసంతృప్తితో పార్టీని వీడారు. తెలంగాణ భవన్‌లో రావుల చంద్రశేఖర్‌రెడ్డికి కెటి రామారావు గులాబీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎంపీ రాములు, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి, మాజీ ఎంపీ మందా జగన్నాథంతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News