Monday, December 23, 2024

గుండెపోటుతో టిడిపి నేత వరుపుల రాజా కన్నుమూత

- Advertisement -
- Advertisement -

అమరావతి: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ టిడిపి నేత వరుపుల రాజా(47) కన్నుమూశారు. గుండె పోటు రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే రాజా తుదిశ్వాస విడిచారని వైద్యులు పేర్కొన్నారు. ఉతరాంధ్ర ఎంఎల్‌సి ఎన్నికల నేపథ్యంలో బొబ్బలి, సాలూరు నియోజక వర్గాలకు ఇంఛార్జ్‌గా పని చేస్తురు. ప్రచారంలో తీరక లేకుండా కార్యకర్తలతో సమావేశమవుతున్నారు. శనివారం రాత్రి 8.30 గంటల వరకు పార్టీ కార్యకర్తలు. బంధువులతో మాట్లాడారు. తీవ్ర గుండెపోటు రావడంతో స్థానకంగా ఉన్న ఆపోలో ఆస్పత్రికి తరలించారు. గతంలో రాజా రెండు సార్లు గుండెపోటు రావడంతో స్టంట్లు వేశారు.  ప్రత్తిపాడు మండల అధ్యక్షుడి నుంచి తన రాజకీయం జీవితం ప్రారంభించారు. డిసిసిబి చైర్మన్, ఆప్కాబ్ వైస్ చైర్మన్‌గా కూడా సేవలందించారు. గత అసెంబ్లీ ఎన్నికలలో టిడిపి తరుపున ఎంఎల్‌ఎగా పోటీ చేసి ఓడిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News