Wednesday, January 22, 2025

అన్న క్యాంటీన్ రిబ్బన్ కటింగ్ కోసం కొట్టుకున్న టిడిపి నాయకులు

- Advertisement -
 అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా రాజంపేటలో అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో రిబ్బన్ కటింగ్ కోసం టిడిపి నాయకులు కొట్టుకున్నారు. రిబ్బన్ కటింగ్ చేస్తుండగా టిడిపి నాయకుల మధ్య తోపులాట జరిగింది. రాజంపేట టిడిపి ఇంఛార్జి సుగవాసి బాలసుబ్రమణ్యం తాను అంటే తాను అని చమర్తి జగన్మోహన్ రాజుతో వాగ్వాదం చేసుకున్నారు. ఎవరికి వారు ప్రకటించుకొని అన్న క్యాంటీన్ ఓపెనింగ్ కార్యక్రమంలో గొడవ పడ్డారు. రాజంపేటలో అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో టిడిపి నాయకుల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో టిడిపి నేత జగన్మోహన్ రాజు ఇంటిపై ఓ వ్యక్తి రాళ్లతో దాడి చేశారు. సదరు వ్యక్తి విద్యార్థి సంఘం నాయకుడు అని, మద్యం మత్తులో రాళ్లు విసిరినట్లు ఉన్నాడని, అతడితో తమకు సంబంధం లేదని సుగవాసి అనుచరులు ఆరోపించారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News