Saturday, December 21, 2024

నారాయణన్‌ను రాష్ట్రపతి చేసింది టిడిపే: చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ప్రతిభా భారతిని అసెంబ్లీ స్పీకర్‌ను చేశామని ప్రతిపక్షనేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. దళిత నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఉద్యోగాల్లో, ప్రమోషన్లలో దళితులకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. కెఆర్ నారాయణన్‌ను రాష్ట్రపతి చేసిన ఘనత టిడిపికే దక్కుతుందన్నారు. జిఎంసి బాలయోగిని లోక్‌సభ స్పీకర్‌ను చేశామని చంద్రబాబు గుర్తు చేశారు. నేషనల్ ఫ్రంట్‌గా ఉన్నప్పుడు అంబేడ్కర్‌కు భారతరత్న ఇప్పించిన ఘనత టిడిపికే దక్కిందన్నారు. దళిత నియోజకవర్గాల్లోనే చంద్రబాబును అడ్డుకుంటోన్న వైసిపి తీరుపై భేటీలో ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి దళిత గడపకు టిడిపి చేరేలా ప్రణాళిక సిద్ధం చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News