Monday, December 23, 2024

ఇందిరా పార్కు ‘మహా ధర్నా’ను విజయవంతం చేయండి: టిడిపి అధ్యక్షుడు కాసాని పిలుపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్వర్యంలో నేడు సోమవారం ఇందిరా పార్కు వద్ద నిర్వహించే మహా ధర్నాని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు టి టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై ఈ మహాధర్నాలో నిరసన వ్యక్తం చేద్దామని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు.

ఈ సందర్భంగా ఆదివారం కాసాని మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో భారీగా కాలయాపన జరుగుతోందన్నారు. ఈ విషయమై ప్రభుత్వానికి తాము లేఖ రాసినా స్పందన లేదని, దీంతో తాము మహాధర్నాకు పిలుపునిచ్చామన్నారు. నేటి ధర్నా కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర, రాష్ట్ర కమిటీల సభ్యులు,పార్టీ అన్ని అనుబంధ సంఘాల అధ్యక్షులు, నాయకులు, పార్లమెంట్ అధ్యక్షులు,రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని కాసాని జ్ఞానేశ్వర్ కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News