అమరావతి: టిడిపి మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రబాబును బుధవారం రాత్రి సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. గుంటూరులోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకుని సిఐడి కార్యాలయానికి తరలించారు. గన్నవరం విమానాశ్రయంలో ఇటీవల జరిగిన బంగారం అక్రమ రవాణాతో సిఎంఒ కార్యాలయంలోని ఓ కీలక అధికారికి సంబంధాలున్నాయంటూ వాట్సాప్ గ్రూప్‌లో మెసేజ్‌లు ఫార్వార్డ్ చేసిన నరేంద్రపై సిఐడి అధికారులు సెప్టెంబర్ 22న కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఈ కేసులో టిడిపి నేతను అదుపులోకి తీసుకున్నారు. నిన్న రాత్రి 8.30 గంటల సమయంలో నరేంద్రను అరెస్టు చేస్తున్నామని అధికారులు తెలిపి అరెస్ట్ నోటీసును అతని భార్య సౌభాగ్యమ్మకు అందజేశారు. నరేంద్రను గురువారం కోర్టులో హాజరుపరచనున్నట్లు నోటీసులో పేర్కొన్నారు. అటు, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నరేంద్ర కుటుంబ సభ్యులతో మాట్లాడి పార్టీ వారికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మరోవైపు గుంటూరులోని సిఐడి కార్యాలయం వద్ద టిడిపి నేతలు, కార్యకర్తలు నిరసనకు దిగారు. వైఎస్సార్‌సీపీ నేతల భూకబ్జా కేసు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే టిడిపి నేతలను అరెస్టు చేస్తున్నారని జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
టిడిపి మీడియా కోఆర్డినేటర్ నరేంద్ర అరెస్ట్
- Advertisement -
- Advertisement -
- Advertisement -