Sunday, December 22, 2024

ఇసుక దందా… జర్నలిస్టును బెదిరించిన టిడిపి ఎంఎల్ఎ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తనపై వ్యతిరేక వార్త రాస్తే తాట తిస్తానంటూ రిపోర్టర్‌ను టిడిపి ఎమ్మెల్యే బెదిరించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జరిగింది. శ్రీకాళహస్తిలోని మునగలపాళెం ప్రాంతంలో కొందరు రాజకీయ నేతలు ట్రాక్టర్ ఇసుకకు రూ.500 చొప్పున అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని వార్త రాసిన రిపోర్టర్‌కు టిడిపి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. తన గురించి వ్యతిరేకంగా వార్తలు రాస్తే తాటతీస్తా ఏమనుకుంటున్నావు, ఇదే చివరి హెచ్చరిక అవుతుందని జర్నలిస్టు మందలించినట్టు సమాచారం. వైసిపి పాలనలో ఇసుక దందా కనబడలేదా? ఇప్పుడే అన్ని గుర్తుకొచ్చాయా? ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకో అని జర్నలిస్టును బెదిరించినట్టు సోషల్ మీడియాలో ఆరోపణలు వస్తున్నాయి. ఇకపై వ్యతిరేక వార్త కనిపిస్తే బాగుండదని, సదరు జర్నలిస్టు కథ ముగిసినట్లే అంటూ శ్రీకాళహస్తి టిడిపి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చినట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News