Sunday, December 22, 2024

సత్యవేడు టిడిపి ఎమ్మెల్యే లైంగిక వేధింపుల కేసులో బిగ్ ట్విస్ట్

- Advertisement -
- Advertisement -

అమరావతి: సత్యవేడు టిడిపి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక వేధింపుల కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఈ కేసులో బాధితురాలు ఫిర్యాదును వెనక్కి తీసుకుంది. తమ క్లయింట్లు ఇద్దరూ రాజీకి వచ్చారంటూ వారి తరుఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు అవాస్తవమని నమోదైన కేసును కొట్టివేయాలంటూ హైకోర్టులో టిడిపి ఎంఎల్ఎ కోనేటి ఆదిమూలం క్వాష్ పిటిషన్‌ వేశారు. దీంతో కోనేటి ఆదిమూలం వేసిన క్వాష్ పిటిషన్ డిస్పోజ్ చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.

సెప్టెంబర్ 5న సత్యవేడు టిడిపి ఎంఎల్‌ఎ కోనేటి ఆదిమూలం రాసలీలల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. చెల్లి అంటూనే తనపై లైంగికంగా దాడి చేశారని ఎంఎల్‌ఎ కోనేటి ఆదిమూలంపై టిడిపి అధిష్టానానికి ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఆదిమూలం ఎంఎల్‌ఎ అయిన తరువాత తనపై కక్ష గటి అసభ్యకరంగా ప్రవర్తించాడని సదరు మహిళ ఆరోపణలు చేసింది. తనతో వివాహేతర సంబంధం కొనసాగించాలని ఆమెపై ఎంఎల్‌ఎ ఒత్తిడి తీసుకొచ్చినట్టు ఆరోపణలు చేసింది. చాలా మంది మహిళలు, ప్రభుత్వ మహిళల మీద కూడా ఇలానే చేశాడని బాధితురాలు ఆరోపణలు చేసిన విషయం విధితమే. పలుమార్లు ఫోన్ చేసి తనని టార్చర్ చేశాడని తెలిపింది. ఎంఎల్‌ఎ ఆదిమూలం తనని లైంగికంగా వేధిస్తున్నాడని తన భర్తకు చెప్పడంతో కామాంధుడి బుద్ది చెప్పాలని నిర్ణయం తీసుకున్నామని, పెన్‌లో కెమెరా పెట్టుకొని ఎంఎల్‌ఎ చెప్పిన బీమాస్ ప్యారడైజ్ హోటల్‌కు వెళ్లానని తెలియజేశారు. తనతో ఆదిమూలం అసభ్యంగా ప్రవర్తిస్తుండగా వీడియో రికార్డు చేసి తన భర్తకు అప్పజెప్పడం జరిగిందని వివరించారు. సదరు ఎంఎల్‌ఎ నుంచి తన కుటుంబానికి ప్రాణభయం ఉందని, ఆదిమూలంపై చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. వీడియో బయటకు వచ్చిన తరువాత  సత్యవేడు ఎమ్మెల్యేతో తన ప్రాణ భయం ఉందని సిఎం చంద్రబాబు నాయుడుకు బాధితురాలు మొరపెట్టుకున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News