గులాబీ కండువాలు కప్పి, పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
మన తెలంగాణ/హైదరాబాద్ : జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జీ, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి జాటోత్ ఇందిర్, పాలకుర్తి తెలుగు యువత నేత ఎడవెల్లి సన్నీ, ఆకుల శ్రీనివాస్, గుగులోతు నరేశ్, కుర్వ శివ, ఎడవెల్లి నవీన్, పల్లెర్ల వెంకటేశ్, కుర్రదేవి తదితరులు హైద్రాబాద్‌లోని మంత్రుల నివాసంలో రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో బిఆర్‌ఎస్ పార్టీలో శుక్రవారం చేరారు. అలాగే పాలకుర్తికి చెందిన కాంగ్రెస్ పార్టీ సిరిపాటి ఎల్లస్వామి, సిరిపాటి మహేశ్‌లు పాలకుర్తి ఉప సర్పంచ్ తరాల చంద్రబాబు, వార్డు సభ్యుడు వీరమనేని హన్మంతరావుల ఆధ్వర్యంలో బిఆర్‌ఎస్‌లో చేరారు.
వాళ్ళందరికి మంత్రి గులాబీ కండువాలు కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రప్రభుత్వం కెసిఆర్, పాలకుర్తి నియోజకవర్గం లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులమై బిఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. మంత్రి ఎర్రబెల్లి నాయకత్వంలో తమ గ్రామ అభివృద్ధికి తాము పాటు పడతామని ప్రతిజ్ఞ చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, పార్టీలో కొత్తగా చేరిన వారికి తగిన రీతిలో సముచిత గౌరవ మర్యాదలు ఉంటాయని చెప్పారు. వాళ్లంతా గ్రామ అభివృద్ధికి పాటుపడాలని, వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని సూచించారు.