Friday, September 20, 2024

పార్టీని రక్షించుకునేందుకు టిడిపి కొత్త ప్లాన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాదద్ : అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయక పోవడంతో పార్టీని వీడిపోతున్న క్యాడర్‌ను రక్షించుకునేందుకు టిడిపి ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే తెలంగాణ అధ్యక్షుడు కాసాని పార్టీని వీడి బిఆర్‌ఎస్ పార్టీలో చేరడం, అంతకు కొద్ది రోజుల ముందే పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర రెడ్డి కూడా అదేదారిలో పయనించడంతో టిడిపి అప్రమత్తం అయింది. ఇప్పటికే పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును ఏపి సర్కార్ పలు కేసులు ఇరికించి ఆయన్ను జైలుకు తరలించడంతో ఆ కేసును ఎదుర్కొనేందుకే ఆ పార్టీ చీఫ్ చంద్రబాబు సతమతమవుతున్నారు.

దీనికి తోడు సిబిఐ, హైకోర్టు ద్వారా ఓ 50 నిబంధలు పాటించే పరిస్థితి నెలకొనడంతో ఆయన ఆచీ తూచీ వ్యవహరిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇదే సందర్భంలో జైలులో తనను పరామర్శించేందుకు వచ్చిన కాసానికి చెప్పినా ఆయన వినకుండా పార్టీని వీడి పోయారు. తాజాగా ఆరోగ్య కారణాలతో షరతులతో కూడాని బెయిల్ తీసుకుని రాజమహేంద్రవరం జైలు నుండి బయటకు వచ్చి హైదరాబాద్‌లో వైద్య చికిత్సలు చేసుకుంటున్న చంద్రబాబు అదే సమయంలో పార్టీని బతికించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

ఒక పక్క తెలంగాణలో పార్టీని బతికించుకోవడంతో పాటు ఏపిలో జనసేనాని పవన్ కళ్యాణ్‌తో ఆయన సంప్రదింపులు జరుపుతున్నారు. తెలంగాణలో ప్రస్తుతానికి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయక పోయినప్పటికీ .. త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేద్దామని ఆయన పార్టీ క్యాడర్‌కు హామీ ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో పని చేసిన పార్టీ అని, క్యాడర్‌ను రక్షించుకునేందుకు తనతో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ఉంటారని ఆయన భరోసా ఇస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం కోటి మందికి పైగానే టి టిడిపి సభ్యత్వం ఉందని, వీరంతా ఎన్‌టిఆర్ ఆశయాలను కొనసాగిస్తూ బడుగు, బలహీన వర్గాల రక్షణ, భద్రతకు మద్దతుగా ఉంటారని ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు తమ పార్టీ కేడర్‌కు సూచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News