Monday, December 23, 2024

ఖమ్మం కాంగ్రెస్‌కు టిడిపి మద్దతు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో : తెలంగాణలో జరుగుతున్న శాసనసభ ఎన్నికలకు దూరంగా ఉన్నా తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించింది.ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి గా పోటీ చేస్తున్న మాజీ టిడిపి నేత,మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు విజయం కోసం టిడిపి శ్రేణులంతా కృషి చేస్తామని ఖమ్మం అసెంబ్లీ టిడిపి ఇంచార్ ్జ,రాష్ట్ర కార్యదర్శి కూరపాటి వెంకటేశ్వర్లు ప్రకటించారు.ఈమేరకు బుధవారం జరిగిన ఖమ్మం నియోజకర్గ టిడిపి కార్యకర్తల విసృత్తస్దాయి సమావేశంలో ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్ధి తుమ్మల నాగేశ్వర్ రావు కూడా పాల్గొన్నారు.ఈ సందర్బంగా టిడిపి శ్రేణులంతా ఖమ్మంలో తుమ్మల గెలుపుకోసం అహోరాత్రులు శ్రమిస్తామన్నారు. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్ధిగా తుమ్మల నాగేశ్వర్ రావుపేరును పార్టీ అధిష్టానం ప్రకటించిన తరువాత మాజీ టిడిపి నేత అయిన తుమ్మల ఖమ్మం జిల్లా కేంద్రంలోని టిడిపి కార్యాలయానికి నేరుగా వెళ్లీ తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా అక్కడ ఉన్న టిడిపి నేతలను కలిసి విజ్ణప్తి చేశారు.ఆ తరువాత చంద్రబాబు నాయుడు బెయిల్ పై విడుదల అయిన తరువాత ఖమ్మం జిల్లా టిడిపి కార్యాలయంలో టిడిపి శ్రేణులు ఏర్పాటు చేసిన సంబురాల్లో తుమ్మల పాల్గొన్నారు.

చంద్రబాబు అరెస్ట్ అయిన వెనువెంటనే ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఖండించిన మొదటి వ్యక్తి కూడా తుమ్మలే.టిడిపితో దాదాపు 40 ఏళ్ళ అనుబంధం ఉండటంతో పాటు ఆయన రాజకీయబిక్షపెట్టినపార్టీ టిడిపి కావడంతో తుమ్మల ప్రస్తుత టిడిపి శ్రేణుల మద్దతుకోరారు.అనాడురాష్ట్రం విడిపోయిన తరువాత టిడిపి ఆంధ్రకే పరిమితం కావడంతో అనాడు బి ఆర్ ఎస్ లో చేరడం అనివార్యం అయ్యింది.కేవలం జిల్లా అభివృద్ది కోసం మనస్సు అంగికరించకపోయినప్పటికి పాత మిత్రుడైన టి ఆర్ ఎస్ అధినేత కెసిఆర్ పిలుపుమేరకు అన్యమనస్కకంగా అప్పటి టి ఆర్ ఎస్ లో చేరారు.తల్లి లాంటి టిడిపిని వీడి గులాబీ గూటికి చేరినందుకు ఆరోజు కన్నీంటిపర్యంతం అయ్యారు.తాను కష్టపడి బలోపేతం చేసిన గులాబీ పార్టీలో 2018 ఎన్నికల్లో సొంత పార్టీ నుంచి వెన్నుపోట్లు ఎదురవడం,కనీసం టీక్కెట్ కూడా ఇవ్వకుండా అవమానించడంతో కేవలం జిల్లా అభివృద్దిని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తుమ్మల పలుమార్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

తనకు టిడిపి పార్టీ మద్దతు ప్రకటించారంటే తన 30 ఏళ్ళ కష్టానికి దక్కిన గౌరవంగా ఆయన అభివర్ణించారు.ఇది ఇలా ఉండగా మధిర లో కూడా సి ఎల్ పి నేత ,కాంగ్రెస్ అభ్యర్ధి మల్లు భట్టి విక్రమార్క్‌కి కూడా ఆ నియోజకవర్గ టిడిపి కమిటి మద్దతు ప్రకటించింది.ఈమేరకు బుధవారం అక్కడ కూడా ఉమ్మడిగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.టిడిపి ఖమ్మం పార్లమెంట్ నియోజవర్గ కార్యదర్శి డా.రామనాథం భట్టికి మద్దతు ప్రకటించారు.కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలనేది పార్టీ లైన్ కాదని, అయితే ఎక్కడికి అక్కడికి స్దానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటున్నామని డా. రామనాథం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News