Monday, December 23, 2024

మూడో కంటికి తెలియకుండా కాంగ్రెస్‌కు మద్దతు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయక పోయినప్పటికీ అధికార పార్టీని నిలువరించేందుకు మూడో కంటికి తెలియకుండా కాంగ్రెస్ పార్టీకి టిడిపి మద్దతిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే దీనిని టి టిడిపి నేతలు ఇంత వరకు ఎవరు ఖండించక పోవడంతో ఈ విషయం వాస్తవమేనన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. అధికార పార్టీ బిఆర్‌ఎస్‌ను ఢీకొనాలంటే ఏ ఒక్క పార్టీ తరం కూడా కావడం లేదు. ఇప్పటికే ప్రజా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పెట్టి సిఎం కెసిఆర్ దూసుకెళ్తుండడంతో ఆయన్ను నిలువరించడం ఎవరితరం కూడా కావడం లేదు.

వరుసగా రెండు సార్లు గెలిచిన బిఆర్‌ఎస్ మూడో సారి కూడా హ్యాట్రిక్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో తాము పోటీ చేయక పోవడంతో తెలుగుదేశం పార్టీ కేడర్ ఓట్లు చీలకుండా అవన్నీ కాంగ్రెస్ పార్టీకే పడేలా చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నట్లు పార్టీ వర్గాల టాక్. ప్రస్తుత పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఎంత కాదనుకున్నా ఆయన టిడిపి నుండి వెళ్లిన వారేనని.. పార్టీలో ఉన్నప్పటి నుండి తన చెప్పినట్లు నడుచుకున్న నాయకుడే కావడంతో రేవంత్ ఉన్నంత వరకు కాంగ్రెస్‌కు మద్దతిచ్చి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కే టిడిపి ఓట్లు పడేలా చూడాలని టిడిపి బాస్ భావిస్తున్నారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. కాంగ్రెస్ విషయంలో ఏది చేసినా మూడో కంటికి తెలయకుండానే చేయాలని చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారని ఆ పార్టీ నేతలు చెబుతుండడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News