Monday, December 23, 2024

తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం ఖాయం : కాసాని జ్ఞానేశ్వర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం రావడం ఖాయమని టి టిడిపి అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్నారు. సుపరిపాలన, మత సామరస్యం రాలవాలంటే టీడీపీ ప్రభుత్వం మళ్ళీ రావాలని ప్రజలు కోరుకుంటుంన్నారని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో వివిధ పార్టీలకు చెందిన నాయకుల చేరిక సందర్భంగా కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ..ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు అన్నివర్గాలకు తగిన ప్రాధాన్యత ,గౌరవం, దక్కిందన్నారు. సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా పనిచేసిన మహనుభావుడు ఎన్టీఆర్ అని కొనియాడారు.

బడుగు వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసిన పార్టీ టిడిపి అని గుర్తుచేశారు. పథకాలు, వృద్ధాప్య పెన్షన్స్, మహిళలకు ఆస్తి హక్కు, ఆహార భద్రత, 2 రూపాయలకు కిలో బియ్యం ఇచ్చిన ఘనత కేవలం తెలుగుదేశం పార్టీకి దక్కుతుందన్నారు. జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తెచ్చిన ఐటీ, ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, ఔటర్ రింగురోడ్డు ..లాంటి అభివృద్ధి పనులు చేసిన గొప్ప నేత విజన్ 2020 తో అందరికీ ఆదర్శంగా నిలిచారని కాసాని అన్నారు. నాటి అభివృద్దే నేటి తెలంగాణ లో టిడిపి కి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పేర్కొన్నారు. అందుకే వివిధ పార్టీలకు చెందిన నాయకులు తెలుగుదేశంలో చేరుతున్నారని, ఇంకా ఎంతో మంది ఈ పార్టీలోకి వచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.

ఈ క్రమంలోనే కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని హుజురాబాద్, ధర్మపురి అసెంబ్లీ నియోజక వర్గాలకు చెందిన రిటైర్డ్ పంచాయితీ రాజ్ ఈఈ కొండ్రా కుమార్, హుజురాబాద్ కు చెందిన బిజెపి నాయకులు పెద్ద ఎత్తున తమ పార్టీలో చేరారన్నారు. ఈ సందర్భంగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ వారికి పసుపు కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్, కరీంనగర్ పార్లమెంటు అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, కనకయ్య, జంగం అంజయ్య, బత్తిని శ్రీనివాస్, ఎడ్ల వెంకటయ్య, దామెర సత్యం, ఆగయ్య, దయాకరరావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News