Sunday, December 22, 2024

తెలంగాణ తలసరి ఆదాయంపై చంద్రబాబు కామెంట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. శనివారం ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న లావాదేవీల గురించి చర్చించారు.

చంద్రబాబు నాయుడు ఆదివారం ఎన్ టిఆర్ భవన్ లో  టిడిపి శ్రేణులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణను ప్రశంసించారు. తెలంగాణకు మంచి పునాది ఉందన్నారు.  తలసరి ఆదాయం విషయంలో తెంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. పైగా గుజరాత్, మధ్యప్రదేశ్, కర్నాటక లను తలసరి ఆదాయం విషయంలో వెనక్కి నెట్టేసిందన్నారు. తెలంగాణ తలసరి ఆదాయం రూ. 308732 కాగా, ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం రూ. 219518 అని తెలిపారు. పైగా ఆయన టిడిపి మళ్లీ తెలంగాణలో పూర్వ వైభవాన్ని పొందుతుందన్నారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News