Monday, January 20, 2025

చంద్రబాబుకు రాఖీ కట్టిన తెలుగు మహిళలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు పలువురు మహిళలు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు మహిళలు, బ్రహ్మకుమారీలు ఈ మేరకు చంద్రబాబుకు రాఖీలు కట్టారు. బుధవారం ఏపిలోని టిడిపి కేంద్ర కార్యాలయం ఎన్‌టిఆర్ భవన్‌లో చంద్రబాబు సమక్షంలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మహిళలను శక్తిమంతులుగా తయారు చేయడమే తమ పార్టీ లక్ష్యం అని అన్నారు. ఎన్‌టీఆర్ ఆత్మగౌరవం ఇస్తే తాను ఆత్మవిశ్వాసం ఇచ్చానని ఆయన పేర్కొన్నారు. విజయదశమి రోజున మహిళల సమక్షంలో తెలుగుదేశం పార్టీ పూర్తిస్థాయి

మేనిఫెస్టో విడుదల చేస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలలోని ప్రజలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల ఆప్యాయతకు రాఖీ పండుగ నిదర్శనమన్నారు. ఇంత మంది మధ్య రాఖీ పండుగ జరుపుకోవడం తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. భారతీయ సంస్కృతి చాలా విశిష్టమైనదని, పిల్లల కోసమే బ్రతికే ప్రజలు మన భారతీయులు అని ఆయన పేర్కొన్నారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల గురించి, వారి భవిష్యత్ గురించి ఆలోచిస్తారని, పిల్లల చదువులు, వారి అవసరాల కోసమే తల్లులు తపిస్తారన్నారు. తల్లి భోజనం చేయకపోయినా పిల్లలకు ముందుగా పెట్టాలని భావిస్తారని, అందుకే నేడు అమెరికాలో కూడా మన సంస్కృతిని ఇప్పుడు అంతా మెచ్చుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News