Monday, December 23, 2024

కేంద్రంలో ఎపిదే కీలక పాత్ర

- Advertisement -
- Advertisement -

ఎన్నికల రణక్షేత్రంలో అన్నిసార్లు పార్టీల వ్యూహాలు ఫలించవు. ఈసారి తిరుగులేని విజయం సాధిస్తామని, 400 పైగా సీట్లు వస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ సహా ఎన్‌డిఎ నేతలంతా ధీమా వ్యక్తం చేశారు. అయితే ప్రతిపక్షం పట్టుదలగా పోరాడి ఎన్‌డిఎ మెజార్టీని బాగా తగ్గించింది. కానీ బిజెపి కూటమిని అధికారంలోకి రాకుండా మాత్రం అడ్డుకోలేకపోయింది. గత ఎన్నికల్లో 353 సీట్లు సాధించిన ఎన్‌డిఎ ఈసారి 300మార్కును దాటడానికి కష్టపడింది. ఎప్పటిలాగే బిజెపి కంచుకోట రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ఆదుకున్నా,

ఈ సారి అనూహ్యంగా దక్షిణాదిలో ఎన్‌డిఎ కూటమికి బలం చేకూరింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో చెప్పుకోదగ్గ సీట్లు సాధించగా, చరిత్రలో తొలిసారి కమ్యూనిస్టు కంచుకోటలోనూ ఖాతా తెరిచింది. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 25 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. అందులో టిడిపి 16 స్థానాలు గెలువగా, జనసేన 2, బిజెపి 3 లోక్‌సభ స్థానాల్లో గెలిచింది. వైఎస్‌ఆర్‌సిపి రెండు చోట్ల విజయం సాధించింది. అధికార ఎన్‌డిఎ పార్టీకి ఇండియా కూటమి గట్టి పోటీ ఇవ్వడంతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ఎపి కీలకపాత్ర పోషించనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News