Wednesday, January 22, 2025

పోలీసుల వేధింపులు…. టిడిపి కార్యకర్త ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Engineering Student Suspicious died in AP

అమరావతి: పోలీసుల వేధింపులు తాళలేక టిడిపి కార్యకర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా మందస మండలం పొత్తంగిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సోషల్ మీడియాలో అధికార పార్టీ నేతల అరాచకాలు, అన్యాయాలను టిడిపి కార్యకర్త వెంకట్రావు పలుమార్లు ప్రశ్నించాడు. వెంకట్రావుపై అధికారు పార్టీ నేతలు ఫిర్యాదు చేయడంతో అతడిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పోలీసులు వేధింపుల భరించలేక వెంకట్రావు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపణలు చేశారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబాన్ని గౌతు శిరీష, నేతలు పరామర్శించారు. టిడిపి కార్యకర్త ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని పలువులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News