Monday, December 23, 2024

చంద్రబాబు సిఎం కావాలని యాగం!

- Advertisement -
- Advertisement -

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆ పార్టీకి చెందిన నాయకుడు యార్లగడ్డ వెంకట్రావు యాగం చేస్తున్నారు. విజయవాడ రూరల్ మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోనే ఈ యాగం రెండురోజులుగా జరుగుతోంది. రెండోరోజు సుదర్శనచక్ర యాగంలో భాగంగా తన సతీమణితో కలసి వెంకట్రావు ప్రత్యేక పూజలు చేశారు.

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వెంకట్రావు గన్నవరంనుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన తలపెట్టిన ఈ అష్టద్రవ్య మహా గణపతి, రాజ్యలక్ష్మి, లక్ష్మీనారసింహ యాగం గురువారంతో ముగుస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News