Monday, December 23, 2024

చంద్రబాబు విడుదల కోరుతూ టిడిపి పూజలు

- Advertisement -
- Advertisement -

101 కొబ్బరికాయలు కొట్టిన నేతలు

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై మోపిన అక్రమ కేసుల నుంచి ఆయన బయటపడాలని, ఆయనపై పెట్టిన కేసులను కోర్టులు కొట్టి వేయాలని , చంద్రబాబు జైలు నుంచి త్వరగా విడుదల కావాలని కోరుతూ ఎన్‌టిఆర్ ట్రస్ట్ భవన్‌లో వినాయకుడి విగ్రహం వద్ద తెలుగుదేశం రాష్ట్ర నాయకులు 101 కొబ్బరి కాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. చంద్రబాబును రాజకీయంగా ఎదుర్కోలేకనే అక్రమ కేసులు బనాయించి ఆయనను అన్యాయంగా జైలు పాలు చేశారన్నారు.

ఎన్ని కేసులు పెట్టి జైలుకు పంపినా ఆయన నిర్దోషిగా బయటపడటం ఖాయమని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంఎల్‌సి, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి అజ్మీరా రాజు నాయక్, తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు భవనం షకీలా రెడ్డి, నల్గొండ పార్లమెంట్ అధ్యక్షులు కశిరెడ్డి శేఖర్ రెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు లీలాపద్మావతి, జగదీశ్‌బాబు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News