Wednesday, January 22, 2025

నూకల నరేష్‌రెడ్డి నివాసంలో మంత్రి కెటిఆర్‌కి తేనీటి విందు

- Advertisement -
- Advertisement -

మరిపెడ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గిరిజన పోడు భూముల పట్టాల పంపిణీతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు శుక్రవారం హాజరయ్యారు. అనంతరం తిరిగి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో మార్గమధ్యలోని మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం గ్రామంలోని బిఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేష్ రెడ్డి నివాసానికి వెళ్లాడు. ఈ సందర్భంగా బిఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేష్‌రెడ్డి, ఆయన కుమారుడు గ్రామ సర్పంచ్ నూకల అభినవ్ రెడ్డిలు సాదరంగా ఆహ్వానించారు.

అక్కడ వారు ఇచ్చిన ఆతిథ్యం స్వీకరించి తేనీటి, అల్ఫాహార విందును ఆరగించి ఆరగంట పాటు మంత్రి కెటిఆర్ స్వేద తీరారు. ఈ సందర్భంగా వారు పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎంపి మాలోతు కవిత, ఎమ్మెల్యేలు బానోతు శంకర్‌నాయక్, హరిప్రియ, ఆరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్, మహబూబాబాద్ జడ్‌పి చైర్‌పర్సన్ కుమారి ఆంగోతు బిందు, మున్సిపల్ చైర్‌పర్సన్ పాల్వాయి రాంమోహన్‌రెడ్డి, జడ్‌పిటిసిలు బండి వెంకట్‌రెడ్డి, సుచిత్ర, బిఆర్‌ఎస్ నాయకులు మెంచు అశోక్ కుమార్, కాలం రవీందర్‌రెడ్డి, గంధసిరి అంబరిష, కొంపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, నూకల శ్రీరంగారెడ్డి, కొంపెల్లి శ్రీధర్‌రెడ్డి, శ్రీరాం నాయక్, స్ధానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News