- Advertisement -
విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన మహారాష్ట్రలోని లాతూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఓ ప్రభుత్వ పాఠశాలలో కామాంధుడిగా మారిన ఓ టీచర్ పై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అంతకుముందు, విద్యార్థులపై లైంగిక వేధింపుల ఘటనపై పాఠశాల ప్రిన్సిపల్ అంతర్గత విచారణ కమిటీ వేశారు.
అంతర్గత విచారణ తర్వాత ప్రిన్సిపాల్ ఫిర్యాదు మేరకు వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. అక్టోబర్ 2024, జనవరి 2025 మధ్య 12 ఏళ్ల బాలురను లైంగికంగా వేధించాడని దర్యాప్తులో తేలిందని అధికారి తెలిపారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -