Monday, December 23, 2024

టీచర్ కొట్టడంతో బాలుని మోచేతికి గాయం

- Advertisement -
- Advertisement -

రెబ్బన: కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లా బూరుగూడ గిరిజన సంక్షేమ కళాశాల ప్రిన్సిపల్ విధ్యార్ధినుల వేధింపుల ఘటనా మరువక ముందే రెబ్బన మండలంలోని గోలేటి ఆశ్రమ పాఠశాలలో గణితశాస్త్రం బోధించే ఉపాధ్యాయురాలు 7వ తరగతి చదువుతున్న తోడుసం గంగారాం ను కర్రతో కొట్టడంతో మోచేతి ఎముకకు బలమైన గాయం అయినట్లు బాలుడి నానమ్మ తెలిపారు. ఈ సంఘటన జరిగి ఐదు రోజులు గడుస్తున్నప్పటికి ఉపాధ్యాయురాలు కాని, ప్రధానోపాధ్యాయుడు కాని బయటకు రానివ్వకుండా చేసారు.

బాధిత విద్యార్థి గంగారాం మోచేతి గాయం ఎక్కువ అవడంతో శనివారం నాడు ప్రధానోపాధ్యాయుడు బాలుని పేరెంట్స్‌కు సమాచారం ఇచ్చి ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. విద్యార్థి తెలిపిన వివరాల ప్రకారం ఐదు రోజుల క్రితం హోంవర్క్ ఇచ్చిందని ఇచ్చిన హోంవర్క్ చేయక పోవడంతో అసహనానికి గురై చేతిలో ఉన్న కర్రతో బలంగా కొట్టడంతో మోచేతి ఎముకకు గాయమైనట్లు తెలిపాడు. అప్పటి నుండి బాలుడు సిక్ రూంలో నుండి బయటకు రాకపోవడంతో తోటి విద్యార్థులు అందించిన సమాచారంతో ప్రధానోప్యాద్యాయుడు తన తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News