- Advertisement -
మార్కులు తక్కువ వచ్చాయని పదోతరగతి విద్యార్థులను టీచర్ చితకబాదిన అమానుష సంఘటన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం ట్రైబల్ వెల్ఫేర్ గురుకులలో చోటుచేసుకుంది. టెన్త్ క్లాస్ విద్యార్థులకు తెలుగులో తక్కవ మార్కులు వచ్చాయని లక్ష్మణ్ అనే ఉపాధ్యాయుడు బ్లాక్ బోర్డు తుడిచే డస్టర్‌తో విచక్షణారహితంగా దాడిచేశాడు. ఉపాధ్యాయుడు దాడి విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలిసింది. ఆగ్రహించిన తల్లిదండ్రులు టీచర్ ను చితకబాదారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేసుకున్న ఎస్పై గిరిధర్ రెడ్డి హాస్టల్ వద్దకు చేరుకుని ఆందోళన చేస్తున్న తల్లితండ్రులకు నచ్చచెప్పారు. అనంతరం కేసు నమోదు చేసుకుని ఉపాధ్యాయుడిని పోలీస్టేషన్‌కు తరలించారు.
- Advertisement -