Monday, April 14, 2025

విద్యార్థినుల పట్ల అసభ్య ప్రవర్తన.. తెలుగు టీచర్‌కి దేహశుద్ధి

- Advertisement -
- Advertisement -

తల్లిదండ్రుల స్థానం తరువాత నిలిచే గురువు, విద్యార్థుల పట్ల కీచక చర్యలకు పాల్పడడంతో విద్యార్థుల తల్లిదండ్రులు కీచక గురువుకు చెప్పులతో కొట్టిన ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మంచిర్యాల బాలికల పాఠశాలలో సంచలనం సృష్టించింది. జిల్లా కేంద్రంలోని బాలికల పాఠశాలలో తెలుగు బోధిస్తున్న ఉపాధ్యాయుడు సత్యనారాయణ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వారిని మానసిక ఇబ్బందులకు గురిచేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు. ఈ విషయాన్ని కొందరు విద్యార్థిన్థులు ముందుగా ఉపాధ్యాయులకు చెప్పడంతో

వారు స్పందించి ఆయనను అడగడంతో రెండు రోజులు సదరు ఉపాధ్యాయడు మితిమీరి విద్యార్థినుల పట్ల ఇంకా అసభ్యంగా ప్రవర్తించాడు. మద్యం సేవించి మంగళవారం పాఠశాలకు వచ్చి ఇబ్బందులకు గురిచేయడంతో బాధిత విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో పలువురు తల్లులు పాఠశాలకు వచ్చి ఆయనను నిలదీయడంతో గోడ దూకి పారిపోబోయాడు. ఉపాధ్యాయుడిని పాఠశాల బయట పట్టుకొని చెప్పులతో కొట్టి సన్మానించారు. మహిళలు రోడ్డుపైనే తనను చితకబాదడంతో తప్పయిందని చివరకు వేడుకున్నాడు. అయినప్పటికీ మహిళలు చెప్పులతో ఆయనను చితక బాదారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News