Friday, December 20, 2024

కేంద్ర మంత్రి కారు ఢీకొని టీచర్ మృతి..

- Advertisement -
- Advertisement -

భోపాల్: మధ్యప్రదేశ్‌లో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ పటేల్ వాహనం ఢీకొన్న ఘటనలో ఓ ఉపాధ్యాయుడు మృతి చెందారు. ఈ ఘటనలో మంత్రితోపాటు మరో ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. మంత్రి పటేల్ రాష్ట్రంలోని ఛింద్వారాలో మంగళవారం ఓ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొని నార్సింగ్‌పూర్‌కు తిరుగు ప్రయాణం సమయంలో సింగోడి బైపాస్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. బైక్‌పై విద్యార్థులతో కలిసి వస్తున్న టీచర్, మంత్రి వాహనం ఢీకొని మృతి చెందాడు. మృతి చెందిన టీచర్‌ను 35 సంవత్సరాల నిరంజన్ చంద్రవంశిగా గుర్తించారు. గాయపడ్డ వారిలో టీచర్ కుమారుడు కూడా ఉన్నారని వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News