Sunday, December 22, 2024

గుండెపోటుతో తరగతి గదిలో పడిపోయిన ఉపాధ్యాయురాలు

- Advertisement -
- Advertisement -

చౌటకూర్: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఉపాధ్యాయురాలు పద్మలత ఒక్కసారిగా కుప్పకూలి కింద పడిపోయింది. సం గారెడ్డిలోని చాణిక్య పురి కాలనీకి చెందిన పద్మలత చౌటకూర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. బుధవారం పాఠశాలకు వచ్చిన ఆమె తరగతి గదిలో ఉన్న సమయంలో గుండె నొప్పి రావడంతో కుప్పకూలిపోయింది.

అప్రమత్తమైన తోటి ఉపాధ్యాయులు ఆమెను వెంటనే సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృ తి చెందినట్లు పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. గత ఐదు ఏళ్ళుగా ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తూ అందరితో కలుపుగోలుగా ఉండే ఆమె మృతి చెందడం పట్ల తోటి ఉపాధ్యాయులు తట్టుకోలేకపోతున్నారు. ఆమె మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News