Sunday, January 19, 2025

ఉపాధ్యాయ అర్హత పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు: డిఆర్‌ఓ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిటీ బ్యూరో ః ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటాచారి సంబంధింత అధికారులను ఆదేశించారు. ఈ నెల 15నన నిర్వహించనున్న పాధ్యాయ అర్హత పరీక్ష ఏర్పాట్లు, నిర్వహణకు సంబంధించి శుక్రవారం తన చాంబర్లోకి రెవెన్యూ ,పోలీస్ ,విద్య ,విద్యుత్, రవాణా ,వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్‌ఓ మాట్లాడుతూ హైదరాబాద్ జిల్లాలో మొత్తం 99 సెంటర్లలో రెండు విడుతగా నిర్వహించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్షను ఎలాంటి అవకతవకలు లేకుండా పకడ్బందీగా నిర్వహించే విధంగా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

మొదటి పేపర్ ఉదయం 9:30 నుండి 12:00 గంటల వరకు, రెండవ పేపర్ 2: 30 గంటల నుండి 5:00 గంటల వరకు పరీక్ష ఉంటుందని, సంబంధిత అధికారులు తమ విధులను సమర్ధవంతంగా నిర్వహించాలని కోరారు. పరీక్ష సమయానికి అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకునే విధంగా ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచాలని ఆర్టీసీ అధికారులకు డిఆర్‌ఓ సూచించారు.

విద్యుత్ శాఖను విద్యుత్ సరఫరా లో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని అదేవిధంగా అన్నిపరీక్ష కేంద్రాల వద్ద త్రాగునీరు ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి పోలీసు శాఖ భారీ బందోబస్తును ఏర్పాటు చేయాలని కోరారు. ప్రతి సెంటర్ వద్ద అత్యవసర వైద్య సేవలకు గాను వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సిబ్బందిని అవసరమైన ప్రాథమిక కిట్లను అందుబాటులో ఉంచాలని అధికారులకు డిఆర్‌ఓ సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News