Friday, December 27, 2024

స్కూల్లో పంతులమ్మ అక్రమ సంబంధం… ఆమె కుమారుడిని భవనం పైనుంచి పడేసి

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: పాఠశాలలో ఓ పంతులమ్మ ఇద్దరు ఉపాధ్యాయులతో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఉపాధ్యాయుడు ఆమె కుమారుడిని కొట్టి భవనం పైనుంచి కిందపడేయడంతో బాలుడి మృతి చెందిన సంఘటన కర్నాటక రాష్ట్రం గడగ్ జిల్లాలో జరిగింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఓ పాఠశాలలో గీతా(34), ముత్తప్ప (33) అనే ఇద్దరు ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు.

కాంట్రాక్ట్ టీచర్ ముత్తప్పతో గీతా వివాహేతర సంబంధం పెట్టుకుంది. అదే స్కూల్ లో మరొక ఉపాధ్యాయుడితో గీతా చనువుగా ఉంటుంది. ముత్తప్పను పట్టించుకోకుండా మరొక టీచర్ తో ఆమె చనువుగా ఉండడంతో గీతాపై అతడు పగ పెంచుకున్నాడు. గీతా కుమారుడు భరత్ కూడా అదే స్కూల్లో చదువుతున్నాడు. భరత్ క్లాస్‌లో ఉండగా ముత్తప్ప బాలుడిపై దాడి చేసి తీవ్రంగా కొట్టాడు. అనంతరం భవనం పైనుంచి కిందపడేశాడు. ముత్తప్పను గీతా ఆపడానికి ప్రయత్నించినప్పుడు ఆమెపై కూడా అతడు దాడి చేశాడు. వెంటనే స్కూల్ సిబ్బంది గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. తలకు బలమైన గాయాలు కావడంతో బాలుడు చికిత్స పొందుతూ చనిపోయాడు. గీతా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. పారిపోయిన ముత్తప్పను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News