Monday, January 20, 2025

పిల్లలకు పాఠాలు చెబుతూ గుండెపోటుతో టీచర్ మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: పిల్లలకు పాఠాలు చెబుతూ క్లాసులోనే ఒక ఉపాధ్యాయుడు మరణించాడు. ఈ విషాద సంఘటన శనివారం ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా వేటపాలెం మండలం వాకావారి పాలెం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం శనివారం ఉదయం పి. వీరబాబు(45) అనే ఉపాధ్యాయుడు పిల్లలకు పాఠాలు చెబుతూ కుర్చీలోనే కుప్పకూలిపోయాడు.

వెంటనే విద్యార్థులు ఇతర టీచర్లకు ఈ విషయాన్ని తెలియచేయగా వారు 108 అంబులెన్సుకు ఫోన్ చేశారు. అంబులెన్స్ సిబ్బంది టీచర్ నాడి పరీక్షించగా అప్పటికే ఆయన మరణించినట్లు తేలింది. ఈ సంఘటనతో విద్యార్థులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. తమ కళ్ల ఎదుటే మాస్టారు మరణించడాన్ని వారు జీర్ణించుకోలేక భోరున విలపించారు. వీరబాబు వేరే గ్రామం నుంచి ఇక్కడకు వచ్చేవారని స్థానికులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News