Saturday, November 16, 2024

ఐ లవ్ యూ అని చెప్పమన్నందుకు టీచర్ ఉద్యోగం ఊస్ట్

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: క్లాస్ రూమ్‌లో విద్యార్థులందరి సమక్షంలో ఒక 8వ తరగతి గర్ల్ స్టూడెంట్‌ను ఐ లవ్ యూ చెప్పాలని కోరిన లెక్కల మాస్టారును గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లా విద్యా శాఖాధికారి(డిఇఓ) ఉద్యోగం నుంచి బర్తరఫ్ చేశారు. ఇతర విద్యార్థుల సమక్షంలో మ్యాథ్స్ టీచర్ తనను ఐ లవ్ యూ అని చెప్పమన్నాడని కర్నావతి స్కూలులో ఆ 8వ తరగతి విద్యార్థిని ఒకరు తన తల్లిదండ్రులతో కలసి ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసిందని డిఇఓ బిఎస్ కైరా బుధవారం తెలిపారు.

క్లాసులోని సిసిటివి ఫుటేజ్‌ను ఇద్దరు విద్యాశాఖ ఇన్‌స్పెక్టర్లు పరిశీలించారని, అయితే మాటలు స్పష్టంగా లేవని ఆయన చెప్పారు. అదీగాక ఆ విద్యార్థిని ఆరోపణలను ఇతర విద్యార్థులెవరూ ధ్రువీకరించడం లేదని ఆయన అన్నారు. అయితే ఆ విద్యార్థినిని, ఆమె తల్లిదండ్రులను సంతృప్లి పరచడానికి లెక్కల టీచర్ బాలముకుంద్‌ను ఉద్యోగం నుంచి బర్తరఫ్ చేశామని డిఇఓ తెలిపారు.

ఇదిలా ఉంటే..స్కూలు ట్రస్టీ అశోక్ భాంభర్ కథనం భిన్నంగా ఉంది. ఆ మ్యాథ్స్ టీచర్ విద్యార్థినితో ఐ లవ్ ఫార్ములా చెప్పమన్నాడు. ఆ అమ్మాయి ఫార్ములాను వివరించలేకపోయింది. మ్యాథ్స్ టీచర్ ఐ లవ్ యూ అని విద్యార్థినితో అనలేదని ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News