Sunday, December 22, 2024

ఉపాధ్యాయుడిని ఇంట్లోనే దారుణంగా చంపేసి…

- Advertisement -
- Advertisement -

అమరావతి: ప్రభుత్వ ఉపాధ్యాయుడిని దారుణంగా హత్య చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఎగువకురవవంకకు చెందిన దొరస్వామి(62) అనే ఉపాధ్యాయుడు దిగువకురవవంకలో ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం భార్య మృతి చెందడంతో కూతురుతో కలిసి ఉంటున్నాడు. గురువారం వేకువజామును దొరస్వామి తలపై బలంగా కొట్టడంతో ఆయన తన ఇంట్లోనే చనిపోయాడు. హత్య జరిగినప్పుడు ఇంట్లోనే కూమార్తె ఉంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కుమార్తెను అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News