Wednesday, January 22, 2025

హైదరాబాద్ లో పదో తరగతి విద్యార్థితో పారిపోయిన టీచర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: స్కూల్ విద్యార్థితో టీచర్ పారిపోయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన హైదరాబాద్ లోని చందానగర్ లో జరిగింది. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిదిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో టెన్త్ క్లాస్ చదువుతున్న విద్యార్థి, అదే స్కూల్ లో ఓ యువతి టీచర్ గా(27) విధుల నిర్వహిస్తుంది. స్కూల్ టీచర్ పదవ తరగతి చదువుతున్న విద్యార్థితో ప్రేమలో పడింది. పదిరోజుల క్రితం టీచర్, విద్యార్థి అదృశ్యమయ్యాడు.

మాయమాటలు చెప్పి మైనర్ గా ఉన్న తమ కొడుకుని ఎత్తుకెళ్ళిందని సదరు టీచర్ పై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో విద్యార్థి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. తమ అమ్మాయి కనిపించడం లేదంటూ చందానగర్ పోలీస్ స్టేషన్ లో టీచర్ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ నెల 16న చందానగర్, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లలో ఇద్దరిపై మిస్సింగ్ కేసు నమోదు చేశారు. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. టీచర్, విద్యార్థి తమ తమ ఇండ్లలోకి రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు విద్యార్థి, టీచర్ ని అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News