Monday, December 23, 2024

భువనగిరిలో విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన పంతులు

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: విద్యార్థులు చెడు మార్గంలో ప్రయాణిస్తే బుద్ధులు చెప్పాల్సిన గురువే దారి తప్పి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండల కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కరస్పాండెంట్ రఘు వెంకట సురేష్ కుమార్ అనే వ్యక్తి కృష్ణ వేణి టాలెంట్ స్కూల్ నడుపుతున్నాడు. స్పెషల్ క్లాసుల పేరుతో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని తన చాంబర్‌కు రమ్మని కబురు పంపాడు. చాంబర్‌కు వచ్చిన తరువాత విద్యార్థినితో కరస్పాండెంట్ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో వెళ్లి విద్యార్థిని తన తల్లికి చెప్పింది. విద్యార్థిని తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో రఘు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆరోపణలు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News