Friday, December 20, 2024

కీచక టీచర్… విద్యార్థినులతో అర్ధనగ్న నృత్యాలు

- Advertisement -
- Advertisement -

భోపాల్: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు దారి తప్పాడు. విద్యార్థులు చెడు పనులు చేస్తే మందలించాల్సిన గురువే బాలికలతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఓ పంతులు విద్యార్థినులతో అర్ధనగ్నంగా డ్యాన్స్‌లు చేయించడంతో పాటు వీడియోలు తీసిన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జబల్‌పూర్ ప్రాంతంలో ఓ ప్రభుత్వ పాఠశాలలో రామ్‌సింగ్ ఠాకూర్ అనే పంతులు విద్యార్థులకు పాఠాలు చెబుతుంటాడు. మార్చి 11న కొందరు విద్యార్థినిలను ఓ గదిలోకి బలవంతంగా తీసుకెళ్లాడు. అనంతరం వారిని అర్ధనగ్నంగా ఉంచి డ్యాన్స్ చేయించాడు. వాళ్లు డ్యాన్స్ చేస్తుండగా తన ఫోన్‌లో వీడియో తీశాడు. ఈ విషయం ఎవరికి చెప్పవద్దని బాలికలకు ఆదేశించాడు. ఓ విద్యార్థిని ఇంటికి వెళ్లి జరిగిన విషయం మొత్తం చెప్పడంతో ప్రధానోపాధ్యాయుడిని అడిగారు. బాలికలు తన కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కీచక టీచర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News