Thursday, January 23, 2025

ఐదో తరగతి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు

- Advertisement -
- Advertisement -

అమరావతి: విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడికి బాలిక తల్లిదండ్రులు, గ్రామస్థులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శివకోటి దుర్గా ప్రసాద్ అనే ఉపాధ్యాయుడు మునగపాకలోని ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్నాడు. గత కొంత కాలంగా ఓ బాలికతో శివకోటి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. 15 రోజుల క్రితం ఐదో తరగతి బాలికతో అసభ్యంగా ప్రవర్తించడంతో అప్పటి నుంచి ఆమె పాఠశాలకు వెళ్లలేదు. తల్లిదండ్రులు ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రులు, స్థానికులతో కలిసి ఉపాధ్యాయుడిని నిలదీశారు. ఉపాధ్యాయుడు నీళ్లు నమలడంతో అతడికి దేహశుధ్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News