- Advertisement -
అయ్యప్ప మాల ధారణ విద్యార్థి కి అవమానం జరిగిన సంఘటన హైదరాబాద్ లోని కొంపల్లి మున్సిపల్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే..స్థానికుల కథనం ప్రకారం..కొంపల్లి లో ఉన్న ఢిల్లీ వరల్డ్ స్కూల్ విద్యార్థి అయ్యప్ప స్వామి దీక్ష వహించి స్కూల్ కి వస్తే ఆ విద్యార్థి ని తరగతి గదిలో కాకుండా లైబ్రరీలో కూర్చో పెట్టారు. అలాగే రేపటి నుండి దీక్షా వస్త్రాలతో స్కూల్ కు రావద్దని ఢిల్లీ వరల్డ్ స్కూల్ యాజమాన్యం విద్యార్థికి చెప్పి వెంటనే ఆ విద్యార్థి ని స్కూల్ యాజమాన్యం స్కూల్ బస్సు లో ఇంటికి పంపించారు.ఆ విద్యార్థి తండ్రి తో ఫోన్ లో మాట్లాడిన ఫోన్ కాల్ రికార్డింగ్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.
- Advertisement -