Friday, November 22, 2024

ఫోర్న్ వీడియో చూపించి బాలుడిపై టీచర్ లైంగిక దాడి

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: విద్యార్థులకు బుద్ధులు నేర్పించాల్సిన టీచర్ దారి తప్పి విద్యార్థితో బలవంతంగా కామ క్రీడలో మునిగిపోయిన సంఘటన అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగింది. కామ క్రీడల విషయం తన తల్లిదండ్రులకు విద్యార్థి చెప్పడంతో ఆ టీచర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జాక్సన్ అనే మహిళ టీచర్(35) కాలిఫోర్నియాలోని డన్‌లప్ లీడర్ షిప్ అకాడమీలో విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. ఓ క్లాస్‌లోని 14 ఏళ్ల విద్యార్థితో చనువుగా ఉంటోంది. సదరు విద్యార్థికి ఫోర్న్ వీడియో చూపించి బాలుడిపై లైంగిక దాడి చేసింది. పలుమార్లు బాలుడిపై టీచర్ లైంగిక దాడి చేయడంతో ఆమె వేధింపులను తట్టుకోలేక తల్లిదండ్రులకు బాలుడు తెలిపాడు. వెంటనే తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో అతడిపై ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని జాక్సన్ అనే టీచర్ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఒక్కరిపైనే లైంగి దాడి చేసిందా? లేక బాధిత విద్యార్థులు ఉన్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News