Sunday, December 22, 2024

స్కూలు గ్రౌండ్‌లో విద్యార్థితో టీచర్ శృంగారం

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: అమెరికాలో ఓ టీచర్ స్కూలు గ్రౌండ్‌లో విద్యార్థితో శృంగారంలో పాల్గొనింది. అంతేకాదు, మిగతా విద్యార్థులను కాపలా పెట్టింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు ఆ ఉపాధ్యాయురాలిని అరెస్టు చేశారు. మిస్సౌరీలో ఈ సంఘటన జరిగింది. పులాస్కీ కౌంటీలోని లాక్వే హైస్కూలులో మ్యాథ్స్ టీచర్‌గా హేలీ క్లిఫ్టన్ కార్మాక్ పని చేస్తోంది. ఇటీవల స్టూడెంట్ అయిన 16 ఏళ్ల యువకుడితో ఆమె శృంగారం చేసింది. ఈ సందర్భంగా స్కూలు గ్రౌండ్‌లోకి ఎవరూ రాకుండా విద్యార్థులను కాపలా పెట్టింది. కాగా బాధిత విద్యార్థి దీనిగురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దీంతో టెక్సాస్‌లోని తన ఇంటికి వెళ్లిన ఆ టీచర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె మొబైల్ ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.ఆ విద్యార్థితో ఆమె జరిపిన సంభాషణలను పరిశీలించారు.ఈ నేపథ్యంలో విద్యార్థితో లైంగిక సంబంధాలు,పిల్లలను వేధించడం, పిల్లల హక్కులను హరించడం వంటి అభియోగాలను ఆమెపై మోపారు. మరో వైపు ఆ టీచర్, విద్యార్థి మధ్య వ్యవహారం తెలిసినా పట్టించుకోని యువకుడి తండ్రిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఆ టీచర్ స్టూడెంట్స్‌తో చాలా చనువుగా ఉంటున్న సంగతితో పాటుగా ఆమె చర్యల గురించి స్కూలు ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్‌కు కూడా తెలుసునని కోర్టు రికార్డుల్లో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News