Thursday, January 2, 2025

టీచర్ ఉద్యోగం చేస్తూ ఇదేం పని?

- Advertisement -
- Advertisement -

ఆయన పిల్లలకు పాఠాలు చెప్పి, చక్కటి మార్గంలో నడిపించాల్సిన ఉన్నతమైన ఉపాధ్యయ వృత్తిలో ఉన్నాడు. కానీ ఆయన బుద్ది పెడదారి పట్టింది. ఆడపిల్లలు వాష్ రూమ్ కి వెళ్లినప్పుడు వాళ్ల వీడియోలు తీస్తూ అడ్డంగా బుక్కయ్యాడు. మహారాష్ట్రలోని నాగపూర్ యూనివర్శిటీ క్యాంపస్ లో ‘అడ్వాంటేజ్ విదర్భ’ పేరిట ఒక ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. దీనికోసం ఏర్పాట్లు చేయవలసిందిగా ఒక ప్రముఖ ప్రైవేట్ స్కూల్లో ఆర్ట్ టీచర్ గా పనిచేస్తున్న మంగేశ్ వినాయక్ రావు ఖాప్రే (37)ను అదికారులు నియమించారు.

అయితే తనకు అప్పగించిన పనిని పక్కనబెట్టిన ఖాప్రే, ఒక  వాష్ రూమ్ దగ్గర తిష్ట వేశాడు. లోపలకి వెళ్లే ఆడవాళ్లను వాష్ రూమ్ కిటీకీలోంచి సెల్ ఫోన్ ద్వారా షూట్ చేయడం మొదలుపెట్టాడు. ఒక విద్యార్థిని ఇది కనిపెట్టి, అధికారులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సీసీటీవి ఫుటేజీని చెక్ చేయగా, వాష్ రూమ్ దగ్గర ఖాప్రే చేస్తున్న వెధవ పని బయటపడింది. అతన్ని అదుపులోకి తీసుకుని, అతని సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఖాప్రే అప్పటికే 12మంది మహిళల వీడియోలు చిత్రీకరించి, వాటిలో కొన్నిటిని డిలీట్ చేసినట్లు పోలీసులు కనుగొన్నారు. అయితే ఖాప్రే మానసిక రుగ్మతలతో బాధపడుతున్నట్లు అనుమానిస్తున్నారు. కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News