Wednesday, January 22, 2025

కల్లు తాగినందుకు ఉపాధ్యాయుడు సస్పెండ్

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కల్లు తాగినందుకు ఉపాధ్యాయుని సస్పెండ్ చేశారు. జిల్లాలోని పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని పేటచెరువు ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్న చిటికెన వెంకటరమణను కల్లు తాగి పాఠశాలకు వస్తున్నాడని , కల్లు తాగడానికి విద్యార్థులను కూడా కల్లు పాకల వద్దకు తీసుకెళ్తున్నారని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఎంఈఓ శ్రీరామ్మూర్తి విచారణ చేసి నివేదికను డీఈఓ కు పంపించగా జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర్ శర్మ ఆదివారం ఉపాధ్యాయుడిని సస్పెన్షన్ చేస్తూ నోటీసులు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News