Saturday, November 23, 2024

విద్యార్థుల దాహార్తి తీర్చేందుకు సొంత నిధులతో బోరు వేయించిన ఉపాద్యాయుడు

- Advertisement -
- Advertisement -

ఖమ్మం/కల్లూర : పుట్టిన పురిటిగడ్డకు, చదువుకున్న పాఠశాలకు ఏదో ఒకటి చేయాలి అనే తాపత్రయంతో మండల పరిధిలోని చండ్రుపట్ల హైస్కూల్లో విధులు నిర్వహిస్తూ లెక్కలు మాస్టారుగా గొప్ప పేరు ప్రఖ్యాతలు గాంచిన దొడ్డపునేని శ్రీనివాసరావు తన సొంత ఖర్చుతో సుమారు 50 వేల రూపాయలతో బోరు వేయించి ఉదారత చాటుకొని గ్రామస్తుల అభినందనలు పొందారు. శుక్రవారం కల్లూరు మండల పరిధిలోని చండ్రుపట్ల జడ్పీహెచ్‌ఎస్ స్కూల్లో లెక్కల మాస్టారుగా విధులు నిర్వహిస్తూ చండ్రుపట్ల గ్రామం తన సొంతూరు జడ్పీహెచ్‌ఎస్ లో చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగిన లెక్కలు మాస్టారుగా విద్యార్థిని విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ పిల్లల దాహాన్ని తీర్చేందుకు 50 వేల రూపాయలతో సొంతంగా బోరు వేయించి ఉదార స్వభావాన్ని చాటుకున్నారు.

దొడ్డపునేని శ్రీనివాసరావు మాస్టారు సొంత ఊర్లో తాను చదువుకున్న పాఠశాలలోనే పిల్లల దాహాన్ని తీర్చాలనే లక్ష్యంతో గత వారం రోజులుగా ఊర్లో ఉన్న మిత్రులతో కలిసి ఈ నిర్ణయం తీసుకొని గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడం ఎంతో అభినందనీయమని, కన్న తల్లిదండ్రుల రుణాన్ని, మనం నివసించిన గ్రామాన్ని ఎప్పుడు తీర్చలేని రుణంగా భావించి పాఠశాలలోనే బోరుని వేయించి ఉదారతను చాటుకోవటం ఎంతో అభినందనీయమని చండ్రుపట్ల గ్రామపంచాయతీ సర్పంచ్ గొల్లమందల ప్రసాద్ అన్నారు. చండ్రుపట్ల జడ్పీహెచ్‌ఎస్ స్కూల్లో విద్యార్థుల దాహాన్ని తీర్చేందుకు తన వంతుగా బోరును వేయించి తన మిత్రుల మరియు కుటుంబీకుల సలహాల మేరకు గొప్ప నిర్ణయం తీసుకొని గొప్ప కార్యక్రమాన్ని చేపట్టటం చాలా అభినందనీయమని కల్లూరు వ్యవసాయ మార్కెట్ ఉపాధ్యక్షులు కాటమనేని వెంకటేశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో వల్లభనేని శ్రీను, జక్కంపూడి కిషోర్, పైళ్ల విశ్వనాథం, వల్లభనేని రవి, భద్రయ్య, ఉపాధ్యాయులు మధు, చావా శ్రీనివాసరావు, శర్మ, పద్మ, ఉషా, మహాలక్ష్మి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News