Monday, December 23, 2024

అసెంబ్లీ ముట్టడికి ఉపాధ్యాయుల యత్నం

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః జివో 317ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు శనివారం అసెంబ్లీని ముట్టడించేందుకు యత్నించారు. ముట్టడికి యత్నించిన ఉపాధ్యాయులను పోలీసులు ఎక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు. విడతల వారీగా ఉపాధ్యాయులు అసెంబ్లీ ముట్టడికి యత్నించడంతో పోలీసులు ఎక్కడికక్కడే ఆందోళన కారులను అడ్డుకున్నారు. ఉపాధ్యాయులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

317 జీవో వల్ల తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. వందల కిలో మీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తోందని అన్నారు. కుటుంబాలకు దూరం అవుతున్నామని, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి స్పందించి స్థానిక జిల్లాలోనే ఉద్యోగం చేసుకునేలా 317 జివోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News